Manase Chaalu / Track 09

భానుడు ఎన్నడూ అస్తమించడు

Bhanudu Ennadu Asthaminchadu

Pre-save Manase Chaalu ↗
More ···
Share on WhatsApp ↗
భానుడు ఎన్నడూ అస్తమించడు చంద్రుడు ఎన్నడూ ఉదయించడు భూమే కదా తనను తాను తిప్పుకుంటూ చీకటిని వెతుకుతాడు గర్వంతో నింగిని చూస్తూ నడిచేవాడు నేలను మరచి ఏదో ఒకనాడు తప్పక తూలి పడతాడు అందుకే చెబుతున్నా నీ గుండె లోతుల్లో వెతుక్కో ఈ గందరగోళంలో ఎందుకు చిక్కుకుపోయావో ఆలోచించుకో కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో ఎందరో వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు కొందరు నిట్టూర్పులతో మిగిలారు కొందరు పాటలై నిలిచిపోయారు వారంతా ఒక క్షణపు కథలే కదా నీవు కూడా ఆ కథలో ఒక చిన్న భాగమే కదా నేడు నీతో ఉన్నావారు రేపు విడిపోవచ్చు చూస్తుండగానే మాయమై పోవచ్చు వెతుక్కో వెతుక్కో నీలో నువ్వు వెతుక్కో అసలైన జ్ఞానపు వెలుగు నీలోనే ఉంది గ్రహించుకో భానుడు ఎన్నడూ అస్తమించడు చంద్రుడు ఎన్నడూ ఉదయించడు భూమే కదా తనను తాను తిప్పుకుంటూ చీకటిని వెతుకుతాడు గర్వంతో నింగిని చూస్తూ నడిచేవాడు నేలను మరచి ఏదో ఒకనాడు తప్పక తూలి పడతాడు అందుకే చెబుతున్నా నీ గుండె లోతుల్లో వెతుక్కో ఈ గందరగోళంలో ఎందుకు చిక్కుకుపోయావో ఆలోచించుకో కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu