Ee Kshaname / Track 01
ఈ క్షణమే మొదలెట్టు
Ee Kshaname Modalettu
Pre-save Ee Kshaname ↗
More ···
ఆ... ఆ... ఓ... ఓ...
సిద్ధం కాలేదని ఆగిపోకు,
యుద్ధం చేయందే ఓడిపోకు!
అన్నీ తెలిసాకే అడుగేస్తానంటే,
ఎన్నటికీ గమ్యం చేరలేవంతే!
సరైన సమయం అంటూ ఏదీ రాదు,
మరలా మరలా ఆలోచిస్తే పనీ కాదు!
ఆగకు... నీ అడుగు ఆపకు,
సాగకు... ఊహల్లో కొనసాగకు !
భయమనే సంకెళ్లు కాళ్ళను ఆపుతుంది,
జయమనే సంకల్పం రెక్కలు ఇస్తుంది!
జరిగే దానికన్నా ఊహలే ఎక్కువ,
పెరిగే బాధలో నిజం చాలా తక్కువ!
కనని రేపటికై నేడు వణకకు,
మానని గాయాలకు మందు వెతకకు!
ఊహల ప్రపంచం ఒక మాయ వల,
సాహసించి తెంచేయ్ ఆ సాలె గూడుని ఇలా!
ఆలోచన చాలు...మొదలెట్టు మిత్రమా...
ఈ క్షణమే మొదలెట్టు... (మొదలుపెట్టు)
ఓ... ఓ...
తప్పులు చేస్తేనే పాఠం వస్తుంది,
ఒప్పుకుంటేనే బలం పెరుగుతుంది!
పర్లేదు... పడినా పర్లేదు,
పర్లేదు... తడబడినా పర్లేదు,
ముందుకే... వెళ్ళు ముందుకే!
ఆలోచన చాలు...మొదలెట్టు మిత్రమా...
ఈ క్షణమే మొదలెట్టు... (మొదలుపెట్టు )
ఆగకు... నీ అడుగు ఆపకు,
సాగకు... ఊహల్లో కొనసాగకు !
భయమనే సంకెళ్లు కాళ్ళను ఆపుతుంది,
జయమనే సంకల్పం రెక్కలు ఇస్తుంది!
ఓ... ఓ...
గతములో ఎన్నో గెలిచావు,
సతమతమవ్వక సాగిపో నీవు!
వచ్చే కష్టాన్ని తట్టుకోగలవు,
నచ్చే గమ్యాన్ని చేరుకోగలవు!
నీ శక్తి నీకు తెలియదు ఇప్పుడే,
గెలిచాకా బయట పడుతుంది అప్పుడే!
ఓ... ఓ...
ఆగకు... నీ అడుగు ఆపకు,
సాగకు... ఊహల్లో కొనసాగకు !
భయమనే సంకెళ్లు కాళ్ళను ఆపుతుంది,
జయమనే సంకల్పం రెక్కలు ఇస్తుంది!
ఓ... ఓ...
ఆలోచన చాలు...
పని మొదలుపెట్టు...
ఇప్పుడే...
మొదలెట్టు మిత్రమా... (మొదలెట్టు)
ఈ క్షణమే మొదలెట్టు... (మొదలుపెట్టు)
ఓ... ఓ...
Lyrics: Veera Babu Manyam. About Ee Kshaname