Ee Kshaname / Track 09
ఓరి మనిషి, నీ మనసు బండ రాయి చేసుకోకు,
Ori Manishi Nee Manasu Banda Raayi Chesukoku
Pre-save Ee Kshaname ↗
More ···
ఓరి మనిషి, నీ మనసు బండ రాయి చేసుకోకు,
ఈ తిమ్మిరి పొగరుని నెత్తి మీద పెట్టుకోకు!
నిజం లేని అబద్ధాన్ని ఎప్పుడూ నమ్ముకోకు,
గుంపులోన ఒంటరిగా దిక్కులేక మిగిలిపోకు!
నిజం ఎంత చెప్పినా అస్సలు వినడు,
మంచి దారి యాడ ఉందో కంట కనడు!
తన తప్పును ఒప్పుకొని ఒక్క మంచి మాట అనడు,
ఈ మదంతో మనిషిలాగ ఒక్క క్షణం ఉండడు!
బండ రాయి లాంటి మనసు కన్నీటితో కరగాలి,
ఈ ఉత్తుత్తి గర్వమంతా గాలిలోన కలవాలి!
తప్పు తెలిసి నిన్ను నువ్వే మన్నించుకోవాలి,
మనిషి జన్మ విలువ ఏందో తెలుసుకోవాలి!
కాలం మారితే రంగులన్నీ మారిపోతాయ్,
చెట్టు మీది ఆకులన్నీ రాలిపోతాయ్!
మట్టి బొమ్మలన్నీ చివరికి మట్టిలోన కలిసిపోతాయ్,
మంచి చేసినా జ్ఞాపకాలే శాశ్వతంగా మిగిలిపోతాయ్!
ఓరి మనిషి, నీ మనసు బండ రాయి చేసుకోకు,
ఈ తిమ్మిరి పొగరుని నెత్తి మీద పెట్టుకోకు!
నిజం లేని అబద్ధాన్ని ఎప్పుడూ నమ్ముకోకు,
గుంపులోన ఒంటరిగా దిక్కులేక మిగిలిపోకు!
ఎవడి సొత్తు కాదురా ఈ నేల మీద జాగా,
బరువు దించి బ్రతకరా ఓ నీటి బొట్టు లాగా!
ద్వేషం వదిలి నవ్వరా ఓ పసి బిడ్డ లాగా,
వెలుగు వస్తే చీకటంతా పారిపోదా వేగంగా!
కాలం మారితే రంగులన్నీ మారిపోతాయ్.
చెట్టు మీది ఆకులన్నీ రాలిపోతాయ్!
మట్టి బొమ్మలన్నీ చివరికి మట్టిలోన కలిసిపోతాయ్,
మంచి చేసినా జ్ఞాపకాలే శాశ్వతంగా మిగిలిపోతాయ్!
ద్వేషం వదిలి నవ్వరా ఓ పసి బిడ్డ లాగా,
వెలుగు వస్తే చీకటంతా పారిపోదా వేగంగా !
ఎవడి సొత్తు కాదురా ఈ నేల మీద జాగా,
బరువు దించి బ్రతకరా ఓ నీటి బొట్టు లాగా!
వదిలేయ్... ఆ పొగరుని వదిలేయ్...
నమ్ముకోకు... అబద్ధాన్ని నమ్ముకోకు...
Lyrics: Veera Babu Manyam. About Ee Kshaname