Ee Kshaname / Track 04
ఆరిపోయిన బూడిదలా... నివురుగప్పి ఉండకు
Aaripoyina Boodidalaa Nivurugappi Undaku
Pre-save Ee Kshaname ↗
More ···
ఆరిపోయిన బూడిదలా... నివురుగప్పి ఉండకు,
అగ్ని కణమై రగులుకొని, పగటి సూరీడై వెలగరా!
ఆరిపోయిన బూడిదలా... నివురుగప్పి ఉండకు,
అగ్ని కణమై రగులుకొని, పగటి సూరీడై వెలగరా!
వెలగరా... వెలగరా... వేయి కాంతులై వెలగరా!
వెలగరా... వెలగరా… వెలుగు పంచి వెలగరా!
తోవకు అడ్డుగా బండలా... పనులేక ఉండకు,
గుడిలో దైవపు రూపమై... అందరి మదిలో వెలగరా!
తోవకు అడ్డుగా బండలా... పనులేక ఉండకు,
గుడిలో దైవపు రూపమై... అందరి మదిలో వెలగరా!
వెలగరా... వెలగరా... వేయి కాంతులై వెలగరా!
వెలగరా... వెలగరా… వెలుగు పంచి వెలగరా!
మిణుగురు పురుగులా మినుకు మినుకుమని... నీ దారికే వెలగకు,
నిండు పున్నమి జాబిలిలా... జగమంతట వెలగరా!
మిణుగురు పురుగులా మినుకు మినుకుమని... నీ దారికే వెలగకు,
నిండు పున్నమి జాబిలిలా... జగమంతట వెలగరా!
పనికిరాని పలుకులా... వ్యర్థంగా ఉండకు,
చదువు నేర్పే శాస్త్రములా… తరతరాలకై వెలుగరా!
పనికిరాని పలుకులా... వ్యర్థంగా ఉండకు,
చదువు నేర్పే శాస్త్రములా… తరతరాలకై వెలుగరా!
వెలగరా… వెలగరా… వేయి కాంతులై వెలగరా...
వెలగరా... వెలగరా... దీపములా... వెలగరా!
Lyrics: Veera Babu Manyam. About Ee Kshaname