Ee Kshaname / Track 05
పారేటి ఏరుకు వీచేటి గాలికి లేని ఆగుట నీకేలా
Paareti Eruku Veecheti Gaaliki Leni Aaguta Neekela
Pre-save Ee Kshaname ↗
More ···
పడిలేచే అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా?
ఉదయించే పొద్దుకు వెలిగే జాబిలికి లేని బలహీనత నీకేలా?
పారేటి ఏరుకు వీచేటి గాలికి లేని ఆగుట నీకేలా?
మొలకెత్తు విత్తుకు పైకొచ్చు మొలకకు లేని బెదురు నీకేలా?
పని చేయు చీమకు తేనెకూర్చు తేటికి లేని విసుగు నీకేలా?
మోసేటి నేలకు కాసేటి మిన్నుకు లేని ఓటమి నీకేలా?
కొట్టుకొను గుండెకు ఆడేటి ఊపిరికి లేని నిలుకడ నీకేలా?
దూసుకుపోవు బాణానికి ఎదురుచూపు గమ్యానికి లేని సందేహం నీకేలా ?
పడిలేచే అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా?
ఉదయించే పొద్దుకు వెలిగే జాబిలికి లేని బలహీనత నీకేలా?
మండేటి నిప్పుకు దారిచూపు దీపానికి లేని జంకు నీకేలా?
కురిసేటి వానకు పండేటి పైరుకు లేని అనుమానం నీకేలా?
కన్నతల్లి ప్రేమకు పసిపాప నవ్వుకు లేని కపటము నీకేలా?
పోరాడు జీవికి గెలిచేటి పంతానికి లేని ఓటమి భయము నీకేలా?
రేపటి ఉదయానికి రాత్రి చుక్కలకు లేని చింత నీకేలా?
విరిసేటి పువ్వుకు కూసేటి పిట్టకు లేని బిడియము నీకేలా?
పడిలేచే అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా?
ఉదయించే పొద్దుకు వెలిగే జాబిలికి లేని బలహీనత నీకేలా?
చేసేటి పనికి, చిందిన చెమటకు లేని వెనుకడుగు నీకేలా?
చిగురించే ఆశకు, నిలిచేటి ధైర్యానికి లేని నిరాశ నీకేలా?
పడి లేచే కెరటానికి, తీరంచేరు నావకు లేని అలసట నీకేలా?
Lyrics: Veera Babu Manyam. About Ee Kshaname