Ee Kshaname / Track 06
ప్రతి పయనం... గమనానికేగా
Prathi Payanam Gamanaanikegaa
Pre-save Ee Kshaname ↗
More ···
ప్రతి గాయం... గానమేగా...
ప్రతి పయనం... గమనానికేగా...
జారిపోయే శృతి ఏదో... దారి వెతికే...
మారిపోయే గతి ఏదో... చేరి బ్రతికే...
తీరిపోయే వ్యధ ఏదో... దరిని వెతికే...
మీరిపోయే కథ ఏదో... సిరిని వెతికే...
ప్రతి గాయం... గానమేగా...
ప్రతి పయనం... గమనానికేగా...
(తానా నానా... తందనానా...)
విల్లు రాపిడి తగిలే... వెలుగు రాలే...
ముళ్ళు పూలై మిగిలే... ఆనందాల పూసే ...
కళ్ళు చెదిరే కలలే... కరిగి రాలే...
జల్లు కురిసే వలపే... జారి రాలే...
(తానా నానా... తందనానా...)
రాయి దెబ్బ తిననిదే... శిల్పం కాదుగా...!
అగ్ని కాలకున్నచో... స్వర్ణం రాదుగా...!
చీకటినే దాటితే... వేకువ ఉందిగా...!
బాధనే జయించే... బలం నీలో ఉందిగా...!
కాలం... కరిగే...
కలలే... మిగిలే...
చిక్కు పడ్డ దారులే... గమకమాయెగా...!
దిక్కు లేని తీరులే... గమ్యమాయెగా...!
చుక్కలన్ని రాలగా... లోకమాయెగా...!
తరగని ధైర్యమే... శ్లోకమాయెగా...!
నీ పయనం... నిరంతరమేగా...!
నీ సంకల్పం... వజ్రాయుధముగా...!
(తానా నానా... తానా...)
స్వరమే... వరమే...
ప్రతి గాయం... గానమేగా...
ప్రతి పయనం... గమనానికేగా...
Lyrics: Veera Babu Manyam. About Ee Kshaname