Prema Geetham / Track 06
నాలో ఉన్నది నీవే
Naalo Unnadi Neeve
Pre-save Prema Geetham ↗
More ···
నీవే… (నీవే) …నాలో ఉన్నది నీవే…
నాలోనే దాగిన సత్యం నీవే చూడు!
వీడని నీ నీడను నీనే గమనించు నేడు!
నాలో వెలిగే ప్రాణం నీవేనని చూడు!
అనంతమైన ప్రేమను గమనించు నేడు!
నీవే… (నీవే) …నాలో ఉన్నది నీవే…(నీవే!)
నీవే... (నీవే!) ...అంతా నీవే!
నాలోనే దాగిన సత్యం నీవే చూడు!
వీడని నీ నీడను నీనే గమనించు నేడు!
నాలో వెలిగే ప్రాణం నీవేనని చూడు!
అనంతమైన ప్రేమను గమనించు నేడు!
కన్నులు మూసినా కనిపించే దీపం,
సముద్ర గర్భంలా నాలో నీ రాగం!
మట్టిలో వెతికే కల్పవృక్షం,
నీవే నా మదిలోనే దాగిన అమృత సారం!
నీవే… (నీవే) …నాలో ఉన్నది నీవే…(నీవే!)
నీవే... (నీవే!) ...అంతా నీవే!
రెప్పల చాటున దాగిన మౌనం,
నిన్నే చూపే అంతర ప్రాణం!
కలతల కనులకు కానరాదు సత్యం,
నిలిచి ఉండేది నాలో నీవే నిత్యం!
ప్రేమ బయటెక్కడో లేదు,
నాలో ఉన్న నిన్ను చూడు!
నీ వెంట నడిచేది మాయ కాదు,
నన్ను నీవు తెలుసుకునేది ఏనాడు!
నీడలా వెంటాడేది లోకం కాదు,
నాలోనే దాగిన సత్యం నీవే చూడు!
వాడిపోయే కాలమే జీవితం కాదు,
వీడని నీ నీడను నీనే గమనించు నేడు!
నీవే… (నీవే) …నాలో ఉన్నది నీవే…(నీవే!)
నీవే... (నీవే!) ...అంతా నీవే!
(నా అంతరంగాన వెలిగే జ్యోతివి నీవే !)
Lyrics: Veera Babu Manyam. About Prema Geetham