Single Is King / Track 06

స్నేహమా…! ఓ నేస్తమా…

Snehamaa O Nesthamaa

Pre-save Single Is King ↗
More ···
Share on WhatsApp ↗
ఓఓఓ... ఓఓఓ... (మరపురాని స్నేహమా) ఓఓఓ... ఓఓఓ... (కరగని బంధమా) స్నేహమా…! ఓ నేస్తమా…! college తీరాన… రాసిన చరితమా! స్నేహమా…! ఓ నేస్తమా…! కాలం కరిగినా… కరగని బంధమా! (ఎప్పటికీ నిలిచే స్వప్నమా) కళ్ళముందు కదలాడే ఆనాటి జ్ఞాపకం…, లైబ్రరీ నిశబ్దంలో సాగిన అధ్యయనం…! నేడు మనమే గీస్తున్న విజయాల చిత్రం, చల్లగాలి పలకరింత మనసుకి మధురం…! (మల్లి వెళ్ళాలి అనిపించే మధుర జ్ణాపకం ) స్నేహమా…! ఓ నేస్తమా…! college తీరాన… రాసిన చరితమా! స్నేహమా…! ఓ నేస్తమా…! కాలం కరిగినా… కరగని బంధమా! కలల సాగులో… గెలుపును గీసిన రోజుల్లో…, క్లాసులో చేసిన మన అల్లరి పనుల్లో…! కాలేజీలో … సాగిన సరదాల్లో…, తీపి గురుతులు దాచుకున్నాం గుండెల్లో…! అన్నీ పంచుకున్న... ఆ స్నేహ బంధంలో…, గతమే మనకి గని... ఈ ఆనంద లోకంలో! చెప్పకుండా కలిసొచ్చేవి… చిన్ననాటి మనసులే…, అప్పటి ఆ స్నేహమే… ఇప్పుడు మన బలములే…! లోకం ఎంత మారినా.. మారని జ్ణాపకాలే , ఎప్పటికీ... మనం పసిపిల్లలమేలే! (పసిపిల్లలమేలే!) స్నేహమా…! ఓ నేస్తమా…! college తీరాన… రాసిన చరితమా! స్నేహమా…! ఓ నేస్తమా…! కాలం కరిగినా… కరగని బంధమా! కాలం ఎంత వేగంగా పరిగెత్తినా ఆగాలి…, మన చిరునవ్వు ఎప్పటికి అలాగే ఉండాలి…! మన ప్రయాణం ఇలాగే సాగాలి…, మరో నూరేళ్లు మన బంధం వర్ధిల్లాలి! (ఎల్లకాలం ఇలాగే సాగాలి!) స్నేహమా…! ఓ నేస్తమా…! college తీరాన… రాసిన చరితమా! స్నేహమా…! ఓ నేస్తమా…! కాలం కరిగినా… కరగని బంధమా! దూరాలు పెరిగినా... దారులు మారినా, మన గుండె చప్పుడు... మారదుగా!

Lyrics: Veera Babu Manyam. About Single Is King