Single Is King / Track 05
Degree పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన
Degree Pattaalu Chethilona Delivery Bagulu Bhujaana
Pre-save Single Is King ↗
More ···
ఓ నాయనో... ఓరి నాయన...
చదువుల తల్లి చల్లగుండ...,
మన బతుకులు మాత్రం మల్లగుండ!
ఏం లాభం లేదండి బాబు... అంతా ఉత్త దండగ !
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!

ఓరి దేవుడా... ఇదేం కర్మరా...!
తల్లిదండ్రి కష్టమంతా... ఏరులోన పాలాయెరా!
మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టి... జోలె సంచి మిగిలాయెరా!
ఇల్లు అద్దె కట్టలేక... గుండె పీకి పోయెరా!
బిల్లులన్నీ పెరిగిపోయే... స్కిల్లు మాత్రం నిల్లు ఆయెరా!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
పట్టా లెన్ని తెచ్చుకున్నా... పట్టు లేదు బుర్రలోన!
జ్ఞానమనేది లేకపోతే... బతుకు పెద్ద సున్నేనన్న!
చెట్టు కింద ప్లీడరులా... గట్టు మీద ఉన్నామన్న!
బొట్టు పెట్టి పిలిచినాగా... సెట్టు కాదు జాబు అన్న!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
సిగ్గు పడితే పొట్ట నిండదు... స్విగ్గీ బండి ఎక్కామన్న!
బాధలన్నీ మరువగ... మందులోన మునిగామన్న!
అగ్గి లాంటి యవ్వనం... బొగ్గు లాగా మారెనన్న!
సాఫ్ట్‌వేర్ కలలు కన్నా... రోడ్డు పాలై పోయామన్న!
తల్లిదండ్రి కష్టమంతా... ఏరులోన పాలాయెరా!
మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టి... జోలె సంచి మిగిలాయెరా!
ఇల్లు అద్దె కట్టలేక... గుండె పీకి పోయెరా!
బిల్లులన్నీ పెరిగిపోయే... స్కిల్లు మాత్రం నిల్లు ఆయెరా!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
చదువు అంటే వ్యాపారం కాదురా నాయనా...
అది బతుకు తెరువు చూపించే మార్గం నాయనా...
ఓ నాయనో... ఓరి నాయనో... తెలుసుకోరా నాయనా...
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
డిగ్రీ పట్టాలు చేతిలోన... డెలివరీ బ్యాగులు భుజాన!
Lyrics: Veera Babu Manyam. About Single Is King