Spoorthi Pradathalu / Track 02

అంబేడ్కరు ఆశయాలు బతికించాలి

Ambedkaru Aashayaalu Bathikinchaali

Pre-save Spoorthi Pradathalu ↗
More ···
Share on WhatsApp ↗
తరతరాల సంకెళ్లు తెంచిన కిరణం..., యుగయుగాల చీకట్లు చీల్చిన జ్ఞానం...! అక్షరంతో నిర్మించెను నవ భారతం..., ఆ దార్శనికుడి ప్రాణమే... మన రాజ్యాంగం! అవమానాలెన్నో ఎదురొచ్చినా... అంటరాని మూలాలు పెకిలించినా... గుండె నిబ్బరం చేసుకుని, ఆకలిని దిగమింగుకుని , తరగని దాహం చదువులపై పెంచుకుని ..., అక్షరాన్ని అయిదముగా మార్చుకుని... "జాతి కిరీటమై... ఆకాశపు అంచున నిలిచారన్నా!" ఆ కలం పోటులో కరిగెనురా అహంకారం..., ఆ గళం సవ్వడి తెచ్చెనురా సమరనాదం! తరతరాల సంకెళ్లు తెంచిన కిరణం... యుగయుగాల చీకట్లు చీల్చిన జ్ఞానం... అక్షరంతో నిర్మించెను నవ భారతం... ఆ దార్శనికుడి ప్రాణమే... మన రాజ్యాంగం! భీమారావ్ అడుగుల్లో... పిడికిలి బిగించిన సదస్సులు! బాబాసాహెబ్ చూపుల్లో... బానిస బ్రతుకులకు భవిష్యత్తులు! జాతీయ జెండాలో... స్వేచ్ఛను చేర్చెరా ... హక్కులను చేర్చి... రాజ్యాంగం ఇచ్చెరా! (జాతీయ జెండాలో... స్వేచ్ఛను చేర్చెరా ...) (హక్కులను చేర్చి... రాజ్యాంగం ఇచ్చెరా!) ఓటు హక్కు ఆయుధాన్ని చేసి... పేదోడిని రాజును చేసారన్నా! ఆడబిడ్డలకెన్నో చట్టాలు తెచ్చీ... అవకాశాలు ఇచ్చారన్నా! గుడికి వెళ్ళేకన్నా... బడికి వెళితేనే బ్రతుకు మారుతుందన్నారన్నా! బుద్ధుని మార్గంలో శాంతిని కోరీ... మానవత్వపు విలువలు పెంచారన్నా! ఆ కలం పోటులో కరిగెనురా అహంకారం..., ఆ గళం సవ్వడి తెచ్చెనురా సమరనాదం! తరతరాల సంకెళ్లు తెంచిన కిరణం..., యుగయుగాల చీకట్లు చీల్చిన జ్ఞానం...! అక్షరంతో నిర్మించెను నవ భారతం..., ఆ దార్శనికుడి ప్రాణమే... మన రాజ్యాంగం! కులమతాల భేదాలు కూల్చేయాలి... అంబేడ్కరు ఆశయాలు బతికించాలి! జై భీమ్ నాదంతో జగతిని తట్టి... రాజ్యాంగ హక్కులనే రక్షించాలి! (జై భీమ్ నాదంతో జగతిని తట్టి... రాజ్యాంగ హక్కులనే రక్షించాలి!!)

Lyrics: Veera Babu Manyam. About Spoorthi Pradathalu