Spoorthi Pradathalu / Track 03

గాంధీజీ పట్టుదల అకుంఠితం Gandhi

Gandhiji Pattudala Akunthitham

Pre-save Spoorthi Pradathalu ↗
More ···
Share on WhatsApp ↗
తరాలు మారినా… యుగాలు మారినా…, తరగని దీపం ఆ మార్గం…! కాలం మారినా… ఆలోచనలు మారినా…, చెరగని రూపం ఆ త్యాగం…! సత్యమొక్కటే ఆయుధమ్ముగా… శాంతి కోరిన ... రథసారధిరా(radhasaaradhiraa)! కత్తి పట్టని పోరులో… నెత్తురు చిందని సమరమిదిరా! సత్యాగ్రహముతోనే… ఆంగ్లేయుల పాలనను అంతం చేసెనురా! అహింసతో జగతిని గెలిచిన... ఆ మహనీయుని కథ ఇదిరా! బాపూజీ పిలుపు ప్రజాగీతం... గాంధీజీ పట్టుదల అకుంఠితం… ! బాపూజీ నడకలోనే ఉంది తంత్రం… గాంధీజీ మాటలోనే ఉంది మంత్రం! తరాలు మారినా… యుగాలు మారినా…, తరగని దీపం ఆ మార్గం…! కాలం మారినా… ఆలోచనలు మారినా…, చెరగని రూపం ఆ త్యాగం…! నడి వీధిలో నూలు వడికెరా… నూరేళ్ళ బానిసత్వం వీడెరా! (నడి వీధిలో నూలు వడికెరా… నూరేళ్ళ బానిసత్వం వీడెరా! ) రామరహీముల ఐక్యత చాటి… మతాలకందని మానవతను చూపెరా! మతాల కన్నా మానవత్వం మిన్నఅని … మనిషిలోన దైవాన్ని చూసెరా ! ద్వేషమనే నిప్పును ఆర్పమన్నారూ… ప్రేమ అనే జ్యోతిని వెలిగించమన్నారూ! పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారూ… గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారూ! బాపూజీ పిలుపు ప్రజాగీతం... గాంధీజీ పట్టుదల అకుంఠితం… ! బాపూజీ నడకలోనే ఉంది తంత్రం… గాంధీజీ మాటలోనే ఉంది మంత్రం! తరాలు మారినా… యుగాలు మారినా…, తరగని దీపం ఆ మార్గం…! కాలం మారినా… ఆలోచనలు మారినా…, చెరగని రూపం ఆ త్యాగం…! అంతరాత్మ మాటే అసలైన వేదం… అది పాటిస్తే ఇక లేదు ఏ భేదం! అనుసరిద్దాం బాపూజీ ప్రతి పాదం… నిలబెడదాం భరతమాత కీర్తి పతాకం (అనుసరిద్దాం బాపూజీ ప్రతి పాదం… నిలబెడదాం భరతమాత కీర్తి పతాకం!! )

Lyrics: Veera Babu Manyam. About Spoorthi Pradathalu