Spoorthi Pradathalu / Track 04
మదర్ తెరెసా Mother Teresa
Mother Teresa
Pre-save Spoorthi Pradathalu ↗
More ···
ఓ... ఓ... ఓ…
(ఆ... ఆ... ఆ...!)
ప్రేమే తన ఆట... ప్రేమే తన పాట!
ప్రేమే తన మాట... ప్రేమే తన బాట!
ప్రేమే తన ఆశ... ప్రేమే తన శ్వాస!
ప్రేమే తన ధ్యాస... ప్రేమే తన భాష!
(ఓ... ఓ... ఓ…!)
ప్రేమతోనే అడుగేసి ప్రాణాలను తాకింది,
జాలి చూపి జగమంత కాంతులను నింపింది!
పేదల కన్నీటిని తుడిచేటి వరమైంది,
తెరెసమ్మ కరుణ చూసి లోకమే మురిసింది!
మదర్ తెరెసా... శాంతి కుసుమా...
ఓ... ఓ... ఓ…!
చేసేటి చిరుపనిలో నిండైన ప్రేమ ఉండాలి,
బాధల్లో ఉన్నవారికి చేదోడు కావాలి1
పెట్టేటి మెతుకుతోటి ఆకలిని తీర్చాలి,
పలికేటి పలుకుతోటి ప్రేమను పంచాలి!
(ఓ... ఓ... ఓ…!)
ప్రేమే తన ఆట... ప్రేమే తన పాట!
ప్రేమే తన మాట... ప్రేమే తన బాట!
ప్రేమే తన ఆశ... ప్రేమే తన శ్వాస!
ప్రేమే తన ధ్యాస... ప్రేమే తన భాష!
మదర్ తెరెసా... ఓ... ఓ... ఓ…!
"చిన్న చిన్న సాయాలే పెనుమార్పు తెస్తాయి",
"చేయి చేయి కలిపితేనే చీకట్లు వీడతాయి",
"నువ్వు ఒంటరివి కావు" అంటూ భరోసాను ఇచ్చింది
మాతృమూర్తి త్యాగమై నిలిచింది!
మదర్ తెరెసా... శాంతి సందేశా...
ఓ... ఓ... ఓ…!
పేదరికం కన్నా తీరనిదే ఏకాంతం
ప్రేమను పంచడమే బతుకునకి పరమార్థం
ఆమె నడచిన దారి సత్యమై వెలిగింది
ఆమె చూపిన బాట నిత్యమై నిలిచింది!
(ఓ... ఓ... ఓ…!)
ప్రేమే తన ఆట... ప్రేమే తన పాట!
ప్రేమే తన మాట... ప్రేమే తన బాట!
ప్రేమే తన ఆశ... ప్రేమే తన శ్వాస!
ప్రేమే తన ధ్యాస... ప్రేమే తన భాష!
మాతృమూర్తి చూపిన బాటలో సాగుదాం
కరుణతోనే నిండిన పయనమై పోదాం
మనిషి మనిషికీ తోడై మమతలను పంచుదాం!
ఆ... ఆ... ఆ...
మదర్ తెరెసా... శాంతి కుసుమా...
ఓ... ఓ... ఓ…!
మదర్ తెరెసా... శాంతి సందేశా...
Lyrics: Veera Babu Manyam. About Spoorthi Pradathalu